Thursday, June 4, 2020

నా పేరు నలుడు... నా పేరు భీముడు

కరోనా మూలంగా ఇంచుమించు అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఖాళీగా ఉండటంతో, ఏదో ఒకటి తినాలనే కోరిక కలగటం సహజం. లాక్‌డౌన్‌ లేని రోజుల్లో హాయిగా ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టుకుని తెప్పించుకునేవారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, కరోనా భయంతో ఎవ్వరూ బయటి నుంచి ఆహారపదార్థాలు తెచ్చుకుని తినటానికి సుముఖత చూపటం లేదు. అందుకోసం లాక్‌డౌన్‌ మొదలైన రోజుల్లోనే కొందరు రకరకాల ప్రణాళికలు వేసుకుని, ఇంటిని రెస్టారెంట్‌గా మార్చుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరిచే వంటకాలను అందంగా అలంకరించి సిద్ధం చేశారు. ఐసొలేషన్‌లో ఉన్నామనే భావన కలగనీయకుండా ఇంటిలోని వారందరినీ ఉత్సాహపరుస్తున్నారు. ‘నీకు నువ్వు తయారు చేసుకో’ అనే మాటను అక్షరాలా పాటిస్తున్నారు. ఇంటినే రంగురంగుల రెస్టారెంట్లుగా డెకొరేట్‌ చేసి, వంటకాలను సైతం ఆకర్షణీయంగా సిద్ధం చేస్తున్నారు. ఇంట్లో రెస్టారెంట్‌ దివ రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నా రితు దాల్మియా, సరికొత్తగా దివ కాసా పేరున ఆ¯Œ లైన్‌లో రెడీ టు కుక్‌ వంటకాల అమ్మకం ప్రారంభించారు. బయట దొరికే ఆహారపదార్థాలు తినడం మంచిది కాదు. ఇంటి దగ్గర తాజాగా, వేడివేడిగా వండుకుని ఆహారం తినటం ఆరోగ్యానికి మంచిది. వండిన పదార్థాలను వేడి చేసుకుని తినటం అనారోగ్యం అంటారు వైద్యులు. ఇది మాత్రమే కాదు, ప్రస్తుతం అందరూ ఇంటి దగ్గరే ఉండటం వల్ల, అందరూ కలిసి, ప్రశాంతంగా, రుచిని ఆస్వాదిస్తూ తినాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం రకరకాల కొత్త కొత్త వంటకాలను యూ ట్యూబ్‌లో పరిశోధిస్తున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో అలసిపోయి, ఏదైనా వేడివేడిగా రుచిగా తినాలనుకునేవారు బాగా పెరిగారు. ఇంటికి వచ్చిన వారికి రుచికరంగా వండి పెట్టాలనే వారు కూడా పెరిగారు’’ అంటున్నారు. ‘‘చైనీస్, థాయి వంటకాలను ఇంటి దగ్గర తయారు చేయటం అందరికీ సాధ్యపడదు. వీటి తయారీ కొద్దిగా కష్టమే. అందువల్ల నేను ఈ సాస్‌లు తయారుచేసే విధానం నేర్పిస్తున్నాను. ఈ సాస్‌లన్నీ కైలిన్‌ తరహా రెసిపీలలో ఉపయోగిస్తున్నారు. చైనీస్, థాయి వంటకాలు తయారు చేయాలంటే, కొద్దిగా నీళ్లు లేదా కొబ్బరి పాలు కలిపితే తాజాగా తయారవుతాయి. ఈ వంటకాలను డైనింగ్‌ టేబుల్‌ మీదకు వచ్చేసరికి రెస్టారెంట్‌ అనుభూతి కలుగుతుంది’’ అంటున్నారు దాల్మియా.. అందరూ యూ ట్యూబ్‌లో చూసి, చైనీస్, కాంటినెంటల్, బార్బిక్యూ వంటకాలను ఇంటి దగ్గరే తయారు చేస్తున్నారు. కాని దాల్మియా తయారు చేసిన రెడీ టు కుక్‌ వంటకాల వల్ల కొన్ని నిమిషాల్లోనే వేడివేడిగా పొగలు కక్కుతున్న వంటకాలను సిద్ధం చేసి, ఆస్వాదిస్తూ అనుభూతి చెందుతున్నారు. లాక్‌డౌన్‌ తరవాత కూడా రెడీ టు కుక్‌ పరిశ్రమ విజయవంతంగానే నడుస్తుందని భావిస్తున్నారు చెఫ్‌లు. ఈ వంటకాల వల్ల ఇంతకుముందు వంట చేయనివారు సైతం, గరిటె పట్టుకుంటున్నారు. వీటిని రెండు నిమిషాలలో రెడీ చేసుకుంటున్నారు. స్వయంగా వండినట్లు అనుభూతి చెందుతున్నారు.. అంటున్నారు దాల్మియా. దీనిని ఉపయోగించుకుని ఇంటింటా నలభీములు తయారవుతున్నారు. పానీపూరీ, వడపావ్, బిసబేళబాత్, పనీర్‌బటర్‌ మసాలా... వంటివి యూ ట్యూబ్‌లో చూస్తూ తయారుచేసి అమ్మ ప్రశంసలు పొందుతున్నారు. ఇంట్లో బార్బిక్యూ అనుభూతి చెందేలా సెట్టింగ్స్‌ వేస్తున్నారు. ఇదొక ర కమైన రెస్టారెంట్‌. బాక్స్‌ శ్రీవాత్సవ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బిటెక్‌ అయిపోయిన తరవాత ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ వచ్చి, రూమ్‌ తీసుకుని ఉంటున్నాను. నాకు వంట రాదు. కాని ఏదో వండుకుని తినేస్తున్నాను. కరోనా మూలంగా టీవీలలో జంక్‌ ఫుడ్‌ తినొద్దని చెబుతున్నారు. అందువల్ల ఇంటి దగ్గరే దేశవిదేశీ వంటకాలను అమ్మ, అత్త వాళ్ల సహాయంతో ముందుగానే జాగ్రత్తగా ప్రిపేర్‌ అయ్యి తయారుచేస్తున్నాం. ‘లిటిల్‌ థింగ్స్‌ బ్రింగ్స్‌ మోర్‌ హ్యాపీనెస్‌’. అమ్మనాన్నలకి ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. ఇలా చేస్తుండటం వల్ల బంధాలు బలపడి, ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇంట్లో వాళ్లందరం కలిసి కూర్చుని ఇలా తినటం ఆనందంగా అలనిపిస్తోంది. ఆఫీసుల్లో ఉన్న ఉద్యోగులకు అందరికీ సమానంగా పని అప్పచెప్తారు. అలాగే మేం కూడా ఒకరు కూరలు తరగటం, ఒకరు వండటం, ఒకరు మసాలాలు చూడటం. ఎవరికి ఎందులో నైపుణ్యం ఉందో చూసి వారికి ఆయా పనులు అప్పచెబుతున్నాం. అందరం తలో చెయ్యి వేయడటం వల్ల రుచికరమైన డిష్‌ సిద్ధమవుతోంది. –––––––––––––––––––––– శివ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రకరకాల వంటకాలు చేయడటం వల్ల, నేను రూమ్‌కి వెళ్లాక కూడా ఆపీసుకి వెళ్లడానికి ముందు స్వయంగా తయారుచేసుకోవటమే కాకుండా, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవచ్చు. అలాగే బయటవారు ఎలా చేస్తారో తెలియదు కనుక, మన చేత్తో మనం చేసుకోవటం బెస్ట్‌. ఇన్ని రోజులూ తెలిసో తెలియకో బయట నుంచి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇటువంటి విపత్కర సమయంలో స్వయంగా వండుకుని తినటం మంచిది కూడా. ఇంట్లో అమ్మ నిరంతరం పనిచేస్తోంది. అమ్మకి కూడా విశ్రాంతి ఇవ్వాలి, అలాగే అమ్మతో ఎక్కువ గడపటానికి, అమ్మకు సహాయపడటానికి అవకాశం కుదిరింది. అమ్మ అందించే ప్రేమకు కానుకగా, దీక్షతో వంట చేయటం నేర్చుకుంటున్నాను. ––––––––––––––––– – వైజయంతి పురాణపండ

No comments:

Post a Comment