Thursday, June 4, 2020

nanditha das short film


లిజ టు హ లిజన్‌ టు హర్‌ డొమెస్టిక్‌ వయొలెన్స్‌ మీద లాక్‌డౌన్‌ సమయంలో నందితాదాస్‌ తీసిన చిత్రం. విస్పర్‌... స్పీక్‌... షౌట్‌...గృహ హింస మీద ఏడు నిమిషాల నిడివిలో నందితాదాస్‌ ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీశారు. నటి, దర్శకురాలు నందితాదాస్‌ తాజాగా గృహ హింస మీద తీసిన షార్ట్‌ పిల్మ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను అమితాబ్‌ బచన్‌ షేర్‌ చేశారు. ఈ చిత్రం పేరు ‘లిజన్‌ టు హర్‌’. లాక్‌డౌన్‌ సమయంలో మహిళలు ఏ విధంగా గృహ హింసకు గురవుతున్నారన్నది ఈ చిత్ర కథ. మహిళలు ఏ విధంగా వివక్షకు గురవుతున్నారనే అంశాన్ని చాలా బాగా చూపించారు నందితాదాస్‌. ఈ చిత్రాన్ని యునెస్కో, యుఎన్‌ఎఫ్‌పిఏ, యునిసెఫ్, యున్‌ మహిళలు, దక్షిణ ఆసియా ఫౌండేషన్‌ (మదన్‌జీత్‌ సింగ్‌ ఫౌండేషన్‌) సపోర్టు చేస్తున్నారు. లాప్‌టాప్‌ మీద పనిచేస్తున్న నందితాదాస్‌తో ఈ షార్ట్‌ఫిల్మ్‌ ప్రారంభమవుతుంది. తను పనిచేసుకుంటున్న గదిలోనే ఆమె కొడుకు ఆడుతూ, స్కేటింగ్‌ చేస్తూ, ‘అమ్మా! అక్టోపస్‌కి మూడు గుండెలు ఉంటాయట తెలుసా... దాని తలను తెగనరికినా మరో గంటసేపు అది జీవించి ఉంటుందట’ అని అడుగుతాడు. లాప్‌టాప్‌ మీద పనిచేస్తూనే, తల్లిగా పిల్లవాడి బాధ్యతలు చూస్తూ, భర్తకు కావలసినవి సమకూరుస్తూ, అంతలోనే ఇంటి పనులు చూసుకుంటూ అష్టావధానం చేస్తుంటుంది నందితాదాస్‌. ఒక పక్కన ఆఫీసు మీటింగు నడుస్తూనే ఉంటుంది. ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో నందితా భర్త, తన గదిలో నుంచి తన డిమాండ్లు వినిపిస్తాడే కాని, తెర మీద కనిపించడు. కాఫీ ఇవ్వమని, మామిడి పండ్లు నాసిక్‌ నుంచి వచ్చాయి తలుపు తీయమని.. ఇలా తన గదిలో ఏ పనీ లేకుండా పడుకుని, ఆమెకు ఆర్డర్లు వేస్తుంటాడు. ఇందులో ఆయన గొంతు మాత్రమే వినిపిస్తుంది. నందితా తన ఆఫీసు వారికి కలిగిన సందేహాలు తీరుస్తూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో నందితాకు ఒక ఫోన్‌ వస్తుంది. ‘ఇది సఖి నెంబరేనా’ అంటూ, తనను రక్షించమని వేడుకుంటుంది. ఆమెను రక్షించాలనుకుని పోలీసులకు ఫోన్‌ చేసి ఆమె నంబరును వారికి ఇస్తుంది నందిత. లింగ వివక్షను పోగొట్టాలని నిశ్చయించుకున్న పాత్రలో కనిపిస్తుంది నందితా. నందితా ఈ వీడియోను షేర్‌ చేస్తూ, ‘లిజన్‌ టు హర్‌. మీ నుంచి వచ్చిన స్పందనకు «ధన్యవాదాలు. చాలామంది ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు’ అంటున్నారు నందితాదాస్‌. నటిగా మంచి పేరు తెచ్చుకున్న నందితా, ఇటువంటి అంశాలను తెరకెక్కించటం తన బాధ్యతగా భావిస్తున్నారు. ––––––––––––––––––––––––––––––––––––––––– –––––––––––––––––––––––––––––––––––––––––

No comments:

Post a Comment