Thursday, June 4, 2020

సెలబ్రిటీలు – వీఢియోలు

ఎంతటి పేరు ప్రఖ్యాతులున్నప్పటికీ చిన్నపాటి తప్పు వీధిన పడేస్తుంది. చిన్న తప్పటడుగు నేలమీద కూలబడేలా చేస్తుంది. తల దించుకునేలా చేస్తుంది. అదే పరిస్థితి ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన కరణ్‌ జోహార్‌కు ఎదురైంది. కారణం సోషల్‌ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులు. ప్రపంచం మొత్తం కరోనాపై యుద్ధం చేస్తున్న సమయంలో కరణ్‌ పెట్టిన పోస్టులు కలకలం సష్టించాయి. ఏమిటి ఈ పోస్టులు అంటూ అందర్నీ భ్రుకుటి ముడి పెట్టుకునేలా చేశాయి. అంతే తన తప్పును గ్రహించిన కరణ్‌ మరో పోస్టులో క్షమాపణలు కోరాడు. తాను అలాంటి పోస్టులు పెట్టకుండా ఉండాల్సిందని అంగీకరించాడు. తన ను మన్నించమని∙అభ్యర్థించాడు. ఆ్రస్ట్రేలియన్‌ కమెడియన్‌ గ్రెటా లీ జేక్సన్‌ బాధ్యతాయుతమైన పోస్టు పెట్టారు. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు 24 గంటలూ శ్రమిస్తున్న వైద్యులు, యజమాని అద్దె తగ్గించడానికి నిరాకరించడంతో రోడ్డున పడ్డ ఓ సాధారణ ఉద్యోగి, సామాన్య ప్రజల జీవనాన్ని దష్టిలో ఉంచుకుని లీ పేరడీ చేసి, పోస్టు చేశాడు. సామాన్యులు నానా కష్టాలూ పడుతుంటే సెలబ్రిటీలు సౌకర్యాలు అనుభవిస్తూ వీడియోలు పోస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టాడు. అమెరికాలో ప్రఖ్యాత టీవీ ప్రెజంటర్‌ ఎలెన్‌ డి జెనెర్స్‌ తన రాజభవనం నుంచి విడుదల చేసి వీడియో, ఆస్ట్రేలియన్‌ యాంకర్‌ అమందా కెల్లర్‌ తన కిచెన్‌లో చేసిన నత్యం, మరో యాంకర్‌ సమంతా ఆర్మిటేజ్‌ పెట్టిన వీడియోలను లీ తన పోస్టులో విమర్శించాడు. విలాసవంతమైన జీవితం గడుపుతూ, మేమంతా ఈ కష్టాలలో భాగమేనంటూ ఆయా వీడియోల్లో పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ లీ గేలి చేశాడు. రెండు నిముషాలున్న ఆ వీడియో సెలబ్రిటీల నిర్లక్ష్యాన్ని ఎగతాళి చేసింది. ‘మీరు భద్రంగా ఉన్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. మీరే నిజమైన హీరోలు. మీ డబ్బు మాకివ్వండి’ అనే సందేశంతో ఆ వీడియో ముగిసింది. లీ పెట్టిన ఈ వీడియోను జోహార్‌ షేర్‌ చేశారు. ఈ వీడియో తనను కదిలించిందనీ, తను పెట్టిన అనేక పోస్టులు చాలామందిని ఎంత గాయపరిచాయో అర్థం చేసుకున్నాననీ, తన పొరకపాటును క్షమించమనీ, తన పోస్టులలో భావోద్వేగం కరవైందనీ కరణ్‌ అందులో కరణ్‌ పేర్కొన్నారు.

No comments:

Post a Comment